'ఆర్ ఆర్ ఆర్'లో నాకు గెస్ట్ రోల్ ఇవ్వాలని కూడా అనిపించలేదా?: రాజమౌళితో ప్రభాస్

Rajamouli interviewed Prabhas
  • రేపు రిలీజ్ అవుతున్న 'రాధేశ్యామ్'
  • జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్ 
  • ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసిన రాజమౌళి 
  • ప్రభాస్ ను పెద్ద షిప్పుతో పోల్చిన వైనం  
ప్రభాస్ - రాజమౌళి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ ను తెచ్చిపెట్టిందే రాజమౌళి అనే విషయం అందరికీ తెలిసిందే. 'రాధే శ్యామ్' రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ ను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇద్దరి మధ్య చాలా సరదాగా .. సందడిగా సంభాషణ కొనసాగింది. 

ప్రభాస్ మాట్లాడుతూ .. "రాజమౌళిగారూ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తీసేటప్పుడు నేను మీకు గుర్తుకురాలేదా? కనీసం నాకు గెస్టు పాత్ర కూడా ఇవ్వాలనిపించలేదా? ఎన్టీఆర్ .. చరణ్ లతో కలిసి నేను కూడా స్క్రీన్ మీద కనిపిస్తే బాగుండేది కదా? మీరు తలచుకుంటే నా కోసం ఒక పాత్రను క్రియేట్ చేయలేరా?" అని అడిగాడు.

అందుకు రాజమౌళి స్పందిస్తూ .. "బాబూ నువ్వు పెద్ద షిప్పులాంటివాడివి. నేను అనుకున్న సీన్ కి షిప్పు అవసరమనిపిస్తే నిన్ను రిక్వెస్ట్ చేసైనా చేయించేవాడిని. కానీ నేను అడిగితే ప్రభాస్ కాదనడు అనే ఉద్దేశంతో ఆ షిప్పును బలవంతంగా తీసుకొచ్చి సీన్లో ఇరికించలేను" అంటూ నవ్వేశారు.
Go Back to Shorts
Prabhas
Pooja Hegde
Rajamouli
Radheshyam Movie

More Telugu News