ఉద్యోగాల ప్రకటన బీజేపీ విజయమే: బండి సంజయ్
- జోనల్ విధానానికి 2018లోనే ఆమోదం
- కేసీఆర్ నాలుగేళ్లు జాప్యం చేశారు
- ఆ నిందను బీజేపీపై వేస్తున్నారు
ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఉద్యోగాల ప్రకటనలో జాప్యానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. జోనల్ విధానానికి 2018లోనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన వైనాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యోగ ప్రకటనపై నాలుగేళ్ల పాటు ఆలస్యం చేసిన కేసీఆర్..ఆ నిందను మాత్రం బీజేపీపై వేసేందుకు యత్నిస్తున్నారన్నారు. ఆలస్యంగా వచ్చినా ఉద్యోగ ప్రకటన బీజేపీ విజయమేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.