తాను ఔటైన తీరుపై విస్మ‌యానికి గురైన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌.. వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తాను ఔటైన తీరుపై విస్మ‌యానికి గురైన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌.. వీడియో ఇదిగో

root video goes viral
  • వెస్టిండీస్‌-ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు మ్యాచు
  • బాల్ వేగాన్ని అంచ‌నా వేయ‌కుండా బ్యాట్‌ను పైకెత్తిన రూట్
  • బ్యాట్ కింది నుంచి వెళ్లి వికెట్ల‌కు త‌గిలిన బంతి
వెస్టిండీస్‌-ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు మ్యాచు జ‌రుగుతోంది. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్ ఊహించ‌ని రీతిలో ఔట‌య్యాడు. బాల్ వేగాన్ని అంచ‌నా వేయ‌కుండా బ్యాట్‌ను ఆయ‌న‌ పైకి లేపగా, ఆ బాల్ బ్యాట్ కింది నుంచి వెళ్లి వికెట్ల‌కు త‌గిలింది. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో కీమర్‌ రోచ్ బౌలింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ఈ విధంగా రూట్ ఔట‌య్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. 

                    
అంత‌కు ముందు కూడా ఓ సారి రూట్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నప్ప‌టికీ కొద్ది సేప‌టికే కీమ‌ర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. కాగా, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ తొలిరోజు 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 268 పరుగులు చేసింది. జానీ బెయిర్‌ స్టో సెంచ‌రీ బాదాడు. ఇక‌ బెన్‌ ఫోక్స్‌ 42 పరుగులు, అలెక్స్‌ లెస్‌ 4, క్రాలే 8, జో రూట్‌ 13, డాన్‌ లారెన్స్ 20, స్టోక్స్‌ 36 పరుగులు చేశారు. 

Viral Videos
Cricket

More Telugu News