Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆఫీసుల వ‌ద్ద సంబ‌రాలు.. వీడియో ఇదిగో

celebrations in trs offiices
  • సంబ‌రాల‌కు నిన్న‌టి నుంచే ఏర్పాట్లు
  • తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు 
  • నిరుద్యోగ బంధు కేసీఆర్ అంటూ నినాదాలు
  • జిల్లాల్లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
తెలంగాణ‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భ‌ర్తీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. రేపు నిరుద్యోగుల కోసం ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని నిన్న వ‌న‌ప‌ర్తిలోనే కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

దీంతో నిన్న‌టి నుంచి సంబ‌రాల‌కు ఏర్పాటు చేస్తోన్న టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేయ‌గానే వేడుక‌లు ప్రారంభించారు. హైద‌రాబాద్‌లోని తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. నిరుద్యోగ బంధు కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాల వ‌ద్ద‌ ఫ్లెక్సీలు పెట్టారు. ప‌లు జిల్లాలలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు.
TRS
KCR
Telangana

More Telugu News