Andhra Pradesh: ఉమెన్స్ డే నాడు.. ఏపీలో బ్రిట‌న్ మ‌హిళ‌పై అత్యాచార య‌త్నం

rape attempt on britain lady in nellore district
షార్ట్స్‌లో చూడండి
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు ఏపీలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా ప‌రిధిలో మంగ‌ళవారం ఓ బ్రిట‌న్ మ‌హిళ‌పై అత్యాచార య‌త్నం జ‌రిగింది. నెల్లూరు జిల్లా సైదాపురం స‌మీపంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే.. సైదాపురం ప‌రిధిలోని రావూరు రోడ్డులో బ్రిట‌న్ మ‌హిళ‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత్యాచార య‌త్నానికి పాల్ప‌డ్దారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి స‌మాచారం అందుకున్న పోలీసులు వెనువెంట‌నే రంగంలోకి దిగారు. ఈ ఫిర్యాదుపై కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ మొద‌లుపెట్టారు. బ్రిట‌న్ మ‌హిళ‌పై అత్యాచార య‌త్నానికి పాల్ప‌డ్డ నిందితుల గురించి గాలింపు మొద‌లుపెట్టారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Andhra Pradesh
womens day
Nellore District
rape attempt

More Telugu News