ఏపీలో 61 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

AP Corona Median Bulletin
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 7,547 కరోనా పరీక్షలు నిర్వహించగా, 61 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 కేసులు వెలుగు చూశాయి. విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 237 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వరుసగా మరో రోజు కూడా మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,478 మంది కరోనా బారినపడగా, వారిలో 23,02,862 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 887 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Bulletin
Today Cases

More Telugu News