నిర్మల్ జిల్లాలో ఢీకొట్టుకున్న రెండు ఆర్టీసీ బస్సులు.. 30 మందికి గాయాలు

Road accident in Nirmal district
  • భైంసా నుంచి నిర్మల్ వెళ్తుండగా ప్రమాదం
  • ఒక బస్సును వెనుక నుంచి వేగంగా ఢీకొన్న మరో బస్సు
  • తీవ్రంగా గాయపడ్డ 10 మంది ప్రయాణికులు

తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. భైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును అదే రోడ్డులో వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రెండు బస్సుల్లో ఉన్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మంది వరకు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు 108 వాహనంలో వారిని భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మహిళలకు కాళ్లు విరగడంతో వారిని మెరుగైన చికిత్స కోసం నిర్మల్ కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Nirmal District
Road Accident
RTC

More Telugu News