అన్నీ తెలిసిన బుద్ధుడు ఆయన... మాటల్లో వెటకారం ఉంటుంది: 'రాధేశ్యామ్' లో కృష్ణంరాజు పాత్రపై ప్రభాస్ స్పందన
- ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధేశ్యామ్
- రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చిత్రం
- ఈ నెల 11న విడుదల
- రాధేశ్యామ్ లో పరమహంసగా కృష్ణంరాజు
కృష్ణంరాజు ఈ చిత్రంలో 'పరమహంస' అనే పాత్రలో కనిపిస్తారని ప్రభాస్ వెల్లడించారు. అన్నీ తెలిసిన బుద్ధుడు తరహాలో ఆయన పాత్ర ఉంటుందని, అయితే మాటల్లో వెటకారం ఉంటుందని అన్నారు. పరమహంస పాత్రను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఆ విధంగా తీర్చిదిద్దాడని తెలిపారు. షూటింగ్ లో ఆయన ఎంతో సరదాగా ఉండేవారని, డైరెక్టర్ తోనూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడేవారని వివరించారు. పెదనాన్న ఎనర్జీ చూసి సెట్స్ లో ఆయనతో మాట్లాడేందుకు అందరూ తననే ముందుకు నెట్టేవాళ్లు అని ప్రభాస్ వెల్లడించారు.
గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లో తన పెదనాన్నతో కలిసి బిల్లాలో నటించానని, రాధేశ్యామ్ చిత్రంతో ఆయనకు హిట్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.