ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌భాస్ స్పంద‌న ఇదే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌భాస్ స్పంద‌న ఇదే

prabhas response on cinema ticket rates in ap
  • ఈ నెల 11న రిలీజ్ కానున్న రాధే శ్యామ్‌
  • సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ప్రభాస్  
  • టికెట్ల ధ‌ర పెరిగితే సంతోష‌మేన‌ని వ్యాఖ్య‌
ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై నెల‌కొన్న వివాదంపై టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స్పందించారు. ఈ నెల 11న ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ ను.. ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై నెలకొన్న వివాదంపై మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. దీంతో ప్ర‌భాస్ కూడా ఈ వివాదంపై సింపుల్‌గా త‌న స్పందనను తెలియ‌జేశారు.

రాధే శ్యామ్ సినిమా విడుద‌ల‌కు ముందే ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు పెరిగితే సంతోష‌మేన‌ని ప్ర‌భాస్ చాలా సింపుల్ గానే ఈ వివాదంపై స్పందించారు. ఈ ఒక్క మాట‌తోనే ఆయ‌న సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని త‌న మ‌న‌సులో ఉన్న భావ‌న‌ను వ్య‌క్తం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయ‌క్ విడుద‌ల సంద‌ర్భంగా టికెట్ల రేట్ల‌ను పెంచ‌క‌పోగా.. సినిమా హాళ్ల వ‌ద్ద అధిక ధ‌ర‌లు అమ‌లు కాకుండా ఏపీ ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌ల‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా టికెట్ల రేట్లు పెరి‌గితే బాగుంటుందంటూ ప్రభాస్ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం,
Prabhas
radhe shyam
cinema tickets
Andhra Pradesh

More Telugu News