ప్రభాస్ కు ఇష్టమైన వంటకం ఇదేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ కు ఇష్టమైన వంటకం ఇదేనట!

Prabhas favourite dish
  • ప్రభాస్ కు పులస చేప అంటే ఇష్టమని చెప్పిన ఆయన పెద్దమ్మ
  • కృష్ణంరాజుకు షూటింగ్ లో గాయమైందని వెల్లడి
  • కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం సప్త శనివార వ్రతం చేస్తున్నానని వెల్లడి
పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆయనకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపుతారు. తాజాగా ప్రభాస్ కు ఏ వంటకం ఇష్టమో ఆమె పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య వెల్లడించారు. ప్రభాస్ కు పులస చేప అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పారు. 

ఇక 'రాధే శ్యామ్' చిత్రంలో కృష్ణంరాజు ఒక పాత్రను పోషించారని... షూటింగ్ సందర్భంగా ఆయన కాలికి గాయమయిందని... అయినా రెస్ట్ తీసుకోకుండా నటించారని తెలిపారు. ఆయనకు గాయమైనప్పటి నుంచి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సప్త శనివార వ్రతం చేస్తున్నానని... మరో ఆరు శనివారాలు వ్రతం కొనసాగుతుందని చెప్పారు. కృష్ణంరాజు శివుడిని, భక్త కన్నప్పను ఆరాధిస్తారని... తాను విష్ణువు, పార్వతీదేవిని ఆరాధిస్తానని తెలిపారు.
Prabhas
Favourite dish
Krishnam Raju
Tollywood

More Telugu News