శర్వానంద్ జోడీగా కృతి శెట్టి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శర్వానంద్ జోడీగా కృతి శెట్టి!

Krithi Shetty in Sharwanand movie
  • యూత్ లో కృతి శెట్టికి మంచి క్రేజ్ 
  • హ్యాట్రిక్ హిట్ తో పెరిగిన జోరు 
  • ఈ ఏడాదిలోనే రానున్న రెండు సినిమాలు
  • లైన్లో మరో ప్రాజెక్టు    
కృతి శెట్టి దూకుడు ఇప్పుడు మామూలుగా లేదు. ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా మారిపోయిందని అంటున్నారు. కెరియర్లో ఫస్టు సినిమా హిట్ కావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ కృతి శెట్టి తిరుగులేని కాంబినేషన్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. త్వరలో ఆమె నుంచి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా రానుంది. 

ఇక రామ్ సరసన ఆమె చేస్తున్న 'ది వారియర్' సినిమా కూడా ముగింపు దశకి చేరుకుంది. ఆ తరువాత సినిమాను ఆమె శర్వానంద్ తో చేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కృష్ణచైతన్య దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నట్టుగా సమాచారం. 


వరుసగా యంగ్ హీరోల సరసన నాయికగా అవకాశాలను అందుకుంటూ కృతి శెట్టి దూసుకుపోతోంది. ఇక శర్వానంద్ విషయానికి వస్తే, ఆయన హీరోగా వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. రష్మిక కథానాయికగా అలరించిన ఈ సినిమా ఫరవాలేదనే టాక్ తెచ్చుకుంది.
Sharwanand
Rashmika
Krithi Shetty
Krishnachaitanya movie

More Telugu News