Chiranjeevi: స్వయంగా వచ్చి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారూ: చిరంజీవి

Chiranjeevi thanked Kishan Reddy
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. "స్యయంగా వచ్చి 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు థాంక్యూ కిషన్ రెడ్డి గారూ!" అంటూ చిరంజీవి ఓ ప్రకటన చేశారు. కిషన్ రెడ్డి తన నివాసానికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

ఉగాది సందర్భంగా సాంస్కృతిక శాఖ నిర్వహించే ఈ ఉత్సవాలు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద, గిరిజన కళారూపాలు, నృత్యాలు, సంగీతం, వంటకాలు, సంస్కృతులు దర్శనమిస్తాయని వివరించారు. కళాకారులకు జీవనోపాధి దృష్ట్యా ఇదొక గొప్ప వేదిక అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
.
Go Back to Shorts
Chiranjeevi
Kishan Reddy
Rashtriya Sanskrit Mahotsav
Telangana
India
Tollywood

More Telugu News