ఆంక్షలతో రష్యాకే లాభమట.. పుతిన్ కొత్త థియరీ!
- రష్యాతో సంబంధాలు కొనసాగించండి
- ఆంక్షలు విధించాల్సిన అవసరమేమీ లేదు
- ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తే వారికే నష్టమన్న పుతిన్
రష్యాతో సంబంధాలను తెంచుకోవడమో, లేదంటే తమ దేశంపై ఆంక్షలు విధించడమో చేస్తే.. అది ఆయా దేశాలకు కాకుండా రష్యాకే లాభిస్తుందని కూడా పుతిన్ కొత్త థియరీ చెప్పారు. వివిధ దేశాల ఆంక్షల కారణంగా రష్యాకే లబ్ధి చేకూరుతుందని ఆయన వెల్లడించారు. రష్యాకు దురుద్దేశాలు లేవని చెప్పిన పుతిన్..తమ దేశంపై ఆంక్షలు విధించాల్సిన అవసరమేమీ లేదన్నారు. రష్యాకు సహకరించకూడదని ఎవరైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే.. అది వారికే నష్టం కలిగిస్తుందని కూడా పుతిన్ చెప్పుకొచ్చారు.