తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసులు... అప్ డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 31,303 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 61 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 385 మంది
- ఇంకా 2,386 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,89,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,82,904 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,386 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మరణించారు.
