పుత్ర వియోగంతో బాధపడుతున్న సత్య నాదెళ్ల... సీఎం జగన్ సంతాపం
- సత్య నాదెళ్ల కుమారుడు జైన్ కన్నుమూత
- తీవ్ర విషాదంలో సత్య నాదెళ్ల కుటుంబం
- ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్
- ధైర్యంగా ఉండాలంటూ ట్వీట్
పుట్టుకతోనే సెరెబ్రల్ పాల్సీ బారినపడిన జైన్ నాదెళ్ల... సత్య నాదెళ్ల, అను దంపతులకు తొలి సంతానం. జైన్ తన జీవితకాలం వీల్ చెయిర్ కే పరిమితమయ్యాడు.