దేశంలో భారీగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు
- నిన్న 6,915 కేసుల నమోదు
- కొత్తగా 180 మంది మృతి
- 177.70 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగం
- రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతం
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 92,472 మందికి చికిత్స అందుతోందని పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం 177.70 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపింది. అలాగే, ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 4,23,24,550 మంది కోలుకున్నారని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా ఉంది.