10 వేల దిగువకు చేరిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య
- నిన్న దేశంలో 8,013 కరోనా కేసులు
- 119 మంది కరోనాతో మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతం
- మృతుల సంఖ్య మొత్తం 5,13,843
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,02,601 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,07,686గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 5,13,843కు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 177,50,86,335 డోసుల వ్యాక్సిన్లు వేశారు.