"ఆయుష్మాన్"కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- స్కీమ్ అమలు కోసం రూ.1,600 కోట్ల కేటాయింపు
- నేషనల్ హెల్త్ అథారిటీ ద్వారా పథకం అమలు
- ఇప్పటికే ఈ స్కీం కింద 17 కోట్ల ఖాతాలు ఓపెన్
ఈ స్కీమ్ కింద పౌరులు ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కు సంబంధించిన రికార్డులను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చు. ఈ రికార్డులు వైద్య రంగంలో సేవలందించే వారికి ఉపయోగపడతాయి. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన వైద్య సేవలు పొందే వీలవుతుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను మోదీ సర్కారు ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు 17 కోట్లకు పైగా ఖాతాలు ఓపెన్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.