తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం
- తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
- రేపు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్న వైద్య శాఖ
- అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న హరీశ్ రావు
ఈ క్రమంలో రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నట్టు తెలిపారు. అనంతరం రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్టు చెప్పారు. మరోవైపు రేపు 38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు సూచించారు.