లంక బౌలింగ్ ను ఊచకోత కోసిన ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్... టీమిండియా భారీ స్కోరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
- కిషన్, అయ్యర్ అర్ధసెంచరీలు
- లంక బౌలర్ల విలవిల
- రాణించిన రోహిత్ శర్మ
ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. కిషన్ ఉన్నంతసేపు ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యర్... కిషన్ అవుటయ్యాక లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయ్యర్ 28 బంతుల్లో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 2 భారీ సిక్సులున్నాయి.
అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 32 బంతుల్లో 44 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్ లో అవుటయ్యాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే.