తెలంగాణలో తాజాగా 311 మందికి కరోనా పాజిటివ్

Telangana daily corona cases update
  • గత 24 గంటల్లో 35,837 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 90 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,092 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35,837 కరోనా పరీక్షలు నిర్వహించగా, 311 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 614 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,79,893 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,092 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Bulletin
Daily Update
Today Cases

More Telugu News