'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి టీజర్ రెడీ!
- ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'ఖిలాడి'
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ'
- షూటింగు దశలో 'ధమాకా'
- లైన్లో మరో రెండు సినిమాలు
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి రంగం సిద్ధమైంది. త్వరలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ చెప్పారు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాపై రవితేజ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. నరేశ్ .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తరువాత రవితేజ లైన్లో పెట్టిన ప్రాజెక్టుల జాబితాలో 'ధమాకా' .. రావణాసుర' .. 'టైగర్ నాగేశ్వరరావు' కనిపిస్తున్నాయి.