సమంత, నయనతారల సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
- విఘ్నేశ్ శివన్ నుంచి విభిన్న కథా చిత్రం
- సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా
- కథానాయకుడిగా విజయ్ సేతుపతి
- ఏప్రిల్ 28వ తేదీన విడుదల
అలా కాకుండా ఇద్దరు హీరోయిన్లను హీరో సమానంగా ప్రేమించడం .. ఆ ఇద్దరూ కలిసి అంతే ఇదిగా ఆయనను ప్రేమిస్తే చివరికి ఏం జరిగింది? ఏం మిగిలింది? అనే ప్రశ్నలకి సమాధానమే 'కాతువాకుల రెండు కాధల్' సినిమాలోని సారాంశం అనే మాట వినిపిస్తోంది. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
తమిళంతో పాటు తెలుగులోను సమంత - నయనతారలకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్స్ కలిసి యాక్ట్ చేసిన సినిమా ఇదే. ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నట్టు విఘ్నేశ్ శివన్ చెప్పాడు. తెలుగులోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.