మరోమారు తెలంగాణ బీజేపీ అసమ్మతి నేతల భేటీ
- బండి సంజయ్‌కు వ్యతిరేకంగా రహస్య భేటీ
- గత భేటీలో పాల్గొన్నవారంతా కరీంనగర్ నేతలే
- తాజా భేటీలో కరీంనగర్‌తో పాటు హైదరాబాద్ నేతలూ
అత్యంత రహస్యంగా జరిగిన ఈ భేటీలో బీజేపీ తెలంగాణ శాఖకు చెందిన గుజ్జుల రామకృష్ణ, సుగుణాకర్, వెంకటరమణి, రాములు తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. అంతేకాకుండా తొలుత జరిగిన అసమ్మతి నేతల సమావేశంలో కేవలం కరీంనగర్‌కు చెందిన నేతలు మాత్రమే పాల్గొనగా.. తాజా భేటీలో కరీంనగర్ నేతలతో పాటు హైదరాబాద్‌కు చెందిన నేతలు కూడా పాలుపంచుకున్నారట. ఈ వ్యవహారం మరోమారు బీజేపీ తెలంగాణ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.