Bheemla Nayak: "నాయక్... నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ"... భీమ్లా నాయక్ ట్రైలర్ ఇదిగో!

Here it is Bheemla Nayak trailer
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న విడుదల కానుండగా, నేడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. పవన్ సరసన నిత్యా మీనన్ నటించిన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. సితార ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న భీమ్లా నాయక్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదలకు కొన్నిరోజుల ముందుగా, నేడు ట్రైలర్ ను తీసుకువచ్చారు.

"నాయక్... నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ" అంటూ రానా పలికే డైలాగు ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు, "నేను ఇవతల ఉంటేనే చట్టం... అవతలకి వస్తే కష్టం... వాడికి!" అంటూ పవన్ చెప్పే డైలాగు త్రివిక్రమ్ మార్కును చాటుతోంది. ఇవే కాదు, ట్రైలర్ లో ఉన్న డైలాగులు చూస్తుంటే సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధమవుతోంది.
Go Back to Shorts
Bheemla Nayak
Trailer
Pawan Kalyan
Rana Daggubati
Tollywood

More Telugu News