చంద్రబాబు మాదిరే కేసీఆర్ కనుమరుగు: బండి సంజయ్
- కేసీఆర్ దోపిడీపై త్వరలోనే విచారణ అంటూ ధ్వజం
- ప్రజల దృష్టిని మరల్చేందుకే జాతీయ రాజకీయాలని ఎద్దేవా
- దేశాన్ని కాపాడుతున్నది మోదీనేనని ఉద్ఘాటన
జాతీయ రాజకీయాలపై ఇటీవల వరుస ప్రకటనలు చేస్తున్న కేసీఆర్.. సోమవారం నాడు సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ సర్కారుపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే కేసీఆర్‌పై బండి సంజయ్ ప్రతిదాడికి దిగారు. కేసీఆర్ దోపిడీపై త్వరలో విచారణ జరగబోతోందని, దానిపై ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు.