12 నుంచి 18 ఏళ్ల కుర్రకారుకు 'కోర్బెవాక్స్'... దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ కు అనుమతి
- కోర్బెవాక్స్ ను అభివృద్ధి చేసిన బయోలాజికల్ ఈ
- దేశంలో బాలలకు అందుబాటులోకి రెండో వ్యాక్సిన్
- 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్
- ఇకపై బాలలకు కోర్బెవాక్స్ కూడా ఇవ్వనున్న కేంద్రం
దేశంలో ఇప్పటివరకు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి భారత్ బయోటెక్ తయారుచేసిన 'కొవాగ్జిన్' ను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, బాలల కోసం దేశంలో 'కోర్బెవాక్స్' రూపంలో రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టయింది.