యూపీలో కల్తీ మద్యానికి 9 మంది బలి
- అజాంగఢ్‌లో ఘటన
- మరో 10 మందికి తీవ్ర అస్వస్థత
- వీరి పరిస్థితి కూడా విషమం
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి అయ్యాయి. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కల్తీ మద్యానికి ఏకంగా 9 మంది చనిపోవడం సంచలనం రేపుతోంది.