కాసేపట్లో జగన్ హైదరాబాదుకు బయల్దేరుతారు: వైవీ సుబ్బారెడ్డి

ఏపీ యువ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం ఇరు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. గౌతమ్ మృతి వైసీపీకి తీరని లోటు అని చెప్పారు. ఆయన కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. గౌతమ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ హైదరాబాదుకు బయల్దేరుతారని తెలిపారు.

గౌతమ్ మృతి పట్ల చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ... ఇంత చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాధాకరమని అన్నారు. గౌతమ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి అందరం హైదరాబాదుకు వెళ్తామని... వీలును బట్టి రోడ్డు మార్గాన అయినా వెళ్తామని తెలిపారు.

YV Subba Reddy
Jagan
Gadikota Srikanth Reddy
Mekapati Goutham Reddy
YSRCP

More Telugu News