ఏపీలో గత 24 గంటల్లో 335 కరోనా కేసులు

AP Corona Media Bulletin
  • గత 24 గంటల్లో 19,241 కరోనా పరీక్షలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 84 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 6,754 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 19,241 శాంపిల్స్ పరీక్షించగా, 335 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు కాగా... తూర్పు గోదావరి జిల్లాలో 52 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు గుర్తించారు.

అదే సమయంలో 936 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,94,818 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,754 మందికి చికిత్స జరుగుతోంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,713కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Bulletin
Today Cases

More Telugu News