తెలంగాణలో కొత్తగా 401 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 39,288 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 124 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 5,646 మందికి చికిత్స
అదే సమయంలో 865 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,422 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,76,667 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,646 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,109కి పెరిగింది.
