Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సలహాదారు సజ్జల కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాన్వాయ్ కి కర్నూలు జిల్లాలో స్వల్ప ప్రమాదం సంభవించింది. ముందు వెళుతున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.

కర్నూలు జిల్లాలోని కృష్ణానగర్ వద్ద ఈ ఘటన జరిగింది. కాన్వాయ్ లో ఉన్న సజ్జల సురక్షితంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సజ్జల ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు వచ్చారు.
Sajjala Ramakrishna Reddy
Convoy
Vehicle
Kurnool District
YSRCP
Andhra Pradesh

More Telugu News