కీర్తి సురేశ్ 'వాశి' నుంచి ఫస్టులుక్!
- స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేశ్
- తెలుగు .. తమిళ భాషల్లో బిజీ
- మలయాళంలోను మంచి గుర్తింపు
- టోవినో థామస్ జోడీగా 'వాశి'
టోవినో థామస్ - కీర్తి సురేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఫస్టులుక్ ను ఈ సినిమా నుంచి వదిలారు. ఇద్దరూ కూడా న్యాయవాదులుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. రేవతి కళామందిర్ బ్యానర్ పై సురేశ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి విష్ణు జి రాఘవ్ దర్శకత్వం వహించాడు.
కైలాశ్ మీనన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, విభిన్నమైన కథాకథనాలతో .. ఆసక్తికరమైన మలుపులతో కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. 'మరక్కార్' తరువాత మలయాళంలో కీర్తి సురేశ్ చేసిన సినిమా ఇది. ముఖ్యమైన పాత్రల్లో నందు .. బైజు సంతోష్ .. అనూ మోహన్ .. కృష్ణన్ సోపానం కనిపించనున్నారు.