బాలయ్య కోసం రంగంలోకి దిగిన రామ్ - లక్ష్మణ్!
- మొదలైన గోపీచంద్ మలినేని మూవీ
- బాలకృష్ణకి ఇది 107వ సినిమా
- కథానాయికగా శ్రుతి హాసన్
- నెగెటివ్ రోల్ చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్
ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీని రామ్ - లక్ష్మణ్ అందిస్తున్నారు. యాక్షన్ సీన్ గురించి వారు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మాట్లాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోపీచంద్ మలినేని నుంచి ఇంతకుముందు వచ్చిన 'క్రాక్' సినిమాలో రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలైట్ గా నిలిచాయి.
అందువల్లనే మళ్లీ రామ్ - లక్ష్మణ్ ను ఆయన తీసుకున్నాడు. వాళ్ల నేతృత్వంలోనే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. 'అఖండ'తో బాలకృష్ణను మెప్పించిన తమన్, ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఉన్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది
.