తెలంగాణలో మరో 453 కరోనా పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 41,310 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 134 కొత్త కేసులు
- ఇంకా 6,746 మందికి చికిత్స
అదే సమయంలో 1,380 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గత ఒక్కరోజు వ్యవధిలో కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,85,596 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,74,742 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,746 మంది చికిత్స పొందుతున్నారు.
