ఏపీలో కొత్తగా 528 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona daily bulletin
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 22,339 కరోనా పరీక్షలు నిర్వహించగా, 528 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 101 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 92, గుంటూరు జిల్లాలో 73, కృష్ణా జిల్లాలో 57 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,864 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,15,030 మంది కరోనా బారినపడగా, వారిలో 22,90,853 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,470 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,707కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Bulletin
Today Cases

More Telugu News