సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కవిత
- నేడు కేసీఆర్ జన్మదినం
- తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు జరుపుతున్న టీఆర్ఎస్ శ్రేణులు
- మంత్రి తలసానితో కలిసి ఆలయానికి వచ్చిన కవిత
- తండ్రి పేరిట పూజలు చేయించిన తనయ
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయ వర్గాలు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. పూజల అనంతరం కవితకు తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను మంత్రి తలసాని ట్విట్టర్ లో పంచుకున్నారు.