వివాహంలో విషాదం.. బావిలో పడి13 మంది మహిళల మృతి
- ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఘటన
- స్లాబ్ కుప్పకూలడంతో బావిలో పడిన మహిళలు
- మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం
- విచారం వ్యక్తం చేసిన సీఎం యోగి
ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు ఆనందంగా సాగిన వివాహ వేడుక ఈ ఘటనతో విషాదంగా మారిపోయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.