అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.. హనుమ జన్మస్థలంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- తిరుమలలోనే జన్మించాడన్నది నమ్మకమని కామెంట్
- అందుకే ఆకాశగంగను సుందరీకరిస్తున్నామని వెల్లడి
- శ్రీవాణి ట్రస్టు ద్వారా అభివృద్ధి పనులు
హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడన్న నమ్మకంతోనే ఆకాశగంగ ఆలయాన్ని సుందరీకరిస్తున్నామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పనిసరిగా ఆకాశంగ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలను అందుకోసం వాడుతామన్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. రూ.35 కోట్లతో నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు.