ఏపీలో కొత్తగా 615 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

AP Corona latest media bulletin
  • గత 24 గంటల్లో 22,267 కరోనా పరీక్షలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 134 కొత్త కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 12,550 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,267 శాంపిల్స్ పరీక్షించగా, 615 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 134 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 103, కృష్ణా జిల్లాలో 102 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 2,787 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,13,827 మంది కరోనా బారినపడగా, వారిలో 22,86,575 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,550 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,702కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Latest Bulletin
Today Cases

More Telugu News