యూపీలోని హిందువులంతా బీజేపీకి ఓటు వేయకపోయారో..: తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్
- యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలి
- బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తాం
- వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం
- యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారన్న రాజాసింగ్
బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని ఆయన హెచ్చరించారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని, అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేసి మరోసారి గెలిపించాలని అన్నారు. యోగి మళ్లీ సీఎం కాకూడదని కొందరు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మూడో దశ పోలింగ్ లో బీజేపీకి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తామని అన్నారు.