పసిఫిక్ చిరు ద్వీపదేశంలో కరోనా... ఆపన్నహస్తం అందించిన భారత్
- దాదాపు రెండేళ్లపాటు కరోనాకు నో ఎంట్రీ
- అద్భుతరీతిలో కట్టడి చేసిన పసిఫిక్ దీవులు
- ఇటీవలే సరిహద్దులు తెరిచిన వైనం
- పసిఫిక్ దీవుల్లోనూ కరోనా ప్రవేశం
ఈ క్రమంలో కిరిబాటిలోనూ కరోనా వ్యాప్తి మొదలైంది. పేద దేశం కావడంతో కరోనా సంక్షోభాన్ని తట్టుకోవడం శక్తికి మించిన పనైంది. ఈ నేపథ్యంలో, భారత్ బాసటగా నిలిచింది. వైద్య పరికరాలను భారీ ఎత్తున కిరిబాటికి పంపించింది. పల్స్ ఆక్సీమీటర్లు, పీపీఈ కిట్లు, కొవిడ్ చికిత్సలో ఉపయోగించే అత్యవసర ఔషధాలు, అత్యవసర సహాయ సామగ్రి తరలించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా, భారత్ పంపిన వస్తు సరంజామాను కిరిబాటికి చేరవేయడంలో ఆస్ట్రేలియా సాయపడింది.