సమతామూర్తి కేంద్రం ప్రపంచంలో 8వ వింత: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- సమతామూర్తిని సందర్శించిన వెంకయ్య
- తనకు లభించిన మహాభాగ్యం అని వెల్లడి
- సమతామూర్తి స్ఫూర్తిని అందరికీ పంచాలని పిలుపు
రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషి అని, ప్రజలంతా సమానమని వెయ్యేళ్ల కిందటే చాటారని పేర్కొన్నారు. దళితులను ఆలయప్రవేశం చేయించిన మానవతావాది రామానుజుడు అని ప్రస్తుతించారు. కులం కంటే గుణం గొప్పదని ఎలుగెత్తారని వివరించారు. సమతామూర్తి కేంద్రాన్ని ఎన్నో దేశాల నుంచి ఎందరో వచ్చి సందర్శిస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. సమతామూర్తి స్ఫూర్తిని పెంచడమే కాదు, అందరికీ పంచాలని పిలుపునిచ్చారు.