దేశంలో క‌రోనా కేసుల త‌గ్గుముఖం

corona bulletin in india
  • దేశంలో కొత్తగా 50,407 కేసులు
  • నిన్న 804 మంది మృతి
  • యాక్టివ్ కేసులు 6,10,443
  • మృతుల సంఖ్య మొత్తం 5,07,981
దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. నిన్న దేశంలో 50,407 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 1,36,962 మంది కోలుకున్నారని పేర్కొంది.. క‌రోనా వ‌ల్ల నిన్న 804 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 6,10,443 (1.43 శాతం) మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా మృతుల సంఖ్య‌ 5,07,981కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 172,29,47,688 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News