ప్రపంచవ్యాప్తంగా గంటపాటు ఆగిపోయిన ట్విట్టర్ పిట్ట కూత.. క్షమాపణలు కోరిన ట్విట్టర్
- గత రాత్రి 11 గంటల నుంచి మొరాయింపు
- భారత్‌లోనూ సేవలకు అంతరాయం
- సాంకేతిక సమస్యలే కారణమన్న ట్విట్టర్
ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే అది లాగౌట్ అయిందని మరికొందరు తెలిపారు. స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల కారణంగా సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది.