తెలంగాణలో కొత్తగా 733 కొవిడ్ పాజిటివ్ కేసులు 

Telangana covid bulletin
  • తెలంగాణలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 56,487 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 185 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
తెలంగాణలో గత 24 గంటల్లో 56,487 కరోనా పరీక్షలు నిర్వహించగా, 733 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 185 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 47, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 44, రంగారెడ్డి జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 41 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 2,850 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,82,336 మంది కరోనా బారినపడగా, వారిలో 7,62,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,636 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,106కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Bulletin
Today Cases

More Telugu News