పెరూలో ఘోర బస్సు ప్రమాదం... 20 మంది దుర్మరణం
- టయబంబా నుంచి ట్రుజిల్లో వెళుతున్న బస్సు
- మారుమూల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం
- 100 మీటర్ల వాలులోకి జారిపోయిన బస్సు
- 30 మందికి గాయాలు
ఈ ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉంటాయి. కేవలం 340 కిలోమీటర్లు ప్రయాణించడానికి 14 గంటల సమయం పడుతుంది. గతుకుల రోడ్లు, కొండ ప్రాంతాలు, అధికవేగం వంటి కారణాలతో పెరూలో తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. గత నవంబరులో ఉత్తర పెరూ అటవీప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు.