టీడీపీ నేత‌ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ నేత‌ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అరెస్ట్

devineni slams ycp
  • ఎమ్మెల్సీ అశోక్ బాబును ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన దేవినేని
  • అనుమ‌తి ఇవ్వ‌ని సీఐడీ పోలీసులు
  • గొడ‌వ పెట్టుకున్న‌ దేవినేని
  • దీంతో అదుపులోకి తీసుకున్న వైనం
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును గ‌త‌ అర్ధరాత్రి సీఐడీ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన‌ట్లు కూడా తెలిపింది. ప్ర‌భుత్వ‌ శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్లు ఆరోపణలు రావ‌డంతో ఆయ‌న‌పై సీఐడీ ‌చర్య‌లు తీసుకుంటోంది.

అయితే, ప్ర‌జ‌ల‌ హక్కుల కోసం పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉన్నందుకే అశోక్ బాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఈ క్రమంలో అశోక్ బాబును ప‌రామ‌ర్శించ‌డానికి గుంటూరు సీఐడీ కార్యాల‌యానికి వ‌చ్చిన టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావును పోలీసులు అరెస్టు చేయ‌డం అల‌జ‌డి రేపుతోంది. అశోక్ బాబును క‌లిసేందుకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో వారితో దేవినేని ఉమ గొడ‌వ పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

మ‌రోవైపు, ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ''ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఈ రోజుకీ ప్రజాపాలనపై దృష్టిపెట్టకుండా కక్షసాధింపులకే పరిమితమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ కుట్రలపై ధ్వజమెత్తినందుకే అశోక్ బాబు అరెస్ట్. ఇలాంటి అక్రమ అరెస్టులు ఎల్లకాలం కొనసాగించలేరు. జ‌గ‌న్ నియంతృత్వ పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు'' అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా, అశోక్ బాబును త‌ప్పుడు కేసులో ఇరికించార‌ని టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.
Devineni Uma
Somireddy Chandra Mohan Reddy
Telugudesam

More Telugu News