టీచర్లపై కేసీఆర్ ఉక్కుపాదం.. కేంద్రం జోక్యం చేసుకోవాలి: రేవంత్ రెడ్డి
- జీవో 317ను కేంద్ర హోంశాఖ రద్దు చేయాలని విజ్ఞప్తి
- టీచర్లు కన్నతల్లి, జన్మభూమికి దూరమై క్షోభ పడుతున్నారు
- జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్న టీపీసీసీ చీఫ్
ఉపాధ్యాయుల ఆందోళనపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. 317 జీవో రద్దు డిమాండ్ తో నిన్న హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నాకు తరలివచ్చిన టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. చాలా మంది టీచర్లను నిర్బంధంలోకి తీసుకున్నారు.