తెలంగాణలో కొత్తగా 1,061 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 69,892 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 274 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 21,470 మందికి చికిత్స
అదే సమయంలో 3,590 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,79,971 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,54,399 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,470 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,102కి పెరిగింది.
